సెమీ కండక్టర్ హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్

479
ktr
- Advertisement -

సెమి కండక్టర్ ఇండస్ట్రీ కి హైదరాబాద్ హబ్ గా మారుతోందని తెలిపారు మంత్రి కేటీఆర్. రాయదుర్గంలో అమెరికాకు చెందిన సెమి కండక్టర్స్ కంపెనీ మైక్రాన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్‌ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో కలిసి ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ టాప్ సెమి కండక్టర్ కంపెనీ మైక్రాన్ హైదరాబాద్‌లో తమ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ బాగున్నాయి….మైక్రాన్ సెమి కండక్టర్స్ మనుఫ్యాక్చరింగ్ యూనిట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నా అన్నారు.మైక్రాన్ తో కలిసి మరిన్ని సెమి కండక్టర్ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి చేస్తాం అని తెలిపారు.

ప్రపంచంలో వచ్చే చాలా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ హైదరాబాద్ నుండే జరుగుతున్నాయని తెలిపారు నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.దేశంలో ప్రతీ ఒక్కరికి మొబైల్‌తో పాటు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి…99.8 శాతం ఇండియన్స్ టాక్స్ లు ఆన్‌లైన్ లో కడుతున్నారని చెప్పారు. విదేశాలలో పోలిస్తే కార్పొరేట్ టాక్స్ ఇండియాలో తక్కువగా ఉందని…హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు బెస్ట్ గ్రోత్‌ని నమోదు చేస్తున్నాయని చెప్పారు.

- Advertisement -