సెప్టెంబర్‌ 17..వీరులను స్మరించుకుందాం:కేటీఆర్

500
KTR
- Advertisement -

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జాతీయజెండా ఎగురవేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ . అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్ . భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని పేర్కొన్నారు.

- Advertisement -