ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించి, ఆర్థిక కష్టాలతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థి గణేష్‌కు రూ.1,50,000 ఆర్థిక సాయం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరిగారు గణేష్.
ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే సీట్ కోల్పోయే ప్రమాదం ఉందని, ఆర్థిక సాయం చేయాలని X లో కేటీఆర్‌ను ట్యాగ్ చేసి కోరారు గణేష్. స్థానిక బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ద్వారా అబ్బాయి వివరాలు తెలుసుకొని ఆర్థిక సహాయం చేశారు కేటీఆర్.
గణేష్ పై చదువులకు కావలసిన ఆర్థిక ఖర్చును తాను భరిస్తానని, అండగా ఉంటానని ధైర్యానిచ్చారు కేటీఆర్. కేటీఆర్ అయితే ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికీ రెస్పాండ్ అవుతాడని నమ్మకంతో సహాయం అడిగాను అని చెప్పారు గణేష్.
ఆయన ట్వీట్ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయాను.. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్ కి నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
Also Read:AP: ఇంటి ముంగిటకే కారవాన్!

