కండక్టర్‌ ప్రాణం కాపాడిన కేటీఆర్‌..

210
KTR helping hand to the Conductor
- Advertisement -

ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్‌.. ఈసారి ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడారు. హైబీపీతో మెదడులో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిన అతడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బేరుగు రమేశ్‌ (40) నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు.

రమేశ్‌ను హైదరాబాద్ మాక్స్ క్యూర్ దవాఖానలో చేర్పించగా, ఆపరేషన్‌కు రూ.16లక్షల దాకా అవుతుందని పేర్కొనడంతో రమేశ్ కుటుంబీకులు భయాందోళనకు లోనయ్యారు. ఆర్టీసీ సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోయింది. తెల్లావారిదే ఆదివారం అంతడబ్బుకు అప్రూవ్ కాదని చెప్పేశారు. ఇటు ఆపరేషన్ చేయకుంటే ప్రాణాలు నిలువని అయోమయంలో పడ్డారు. రమేశ్ బావమరిది, టీఆర్‌ఎస్ నాయకుడు మీసరగండ్ల అనిల్ ఈ విషయాన్ని జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు సహాయంతో మంత్రి కేటీఆర్‌కు వాట్సప్ ద్వారా వివరించారు.

KTR helping hand to the Conductor

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సంబంధిత హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ చేయాలని, ఖర్చు సంగతి ఆలోచించవద్దని, అవసరమైతే తాను ఆ ఖర్చు చెల్లిస్తానని చెప్పడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. తర్వాత మంత్రికేటీఆర్ తన పీఏ తిరుపతి, పీఎస్ శ్రీనివాస్‌ను అప్రమత్తం చేసి, ఆపరేషన్ పూర్త య్యే దాకా సమీక్షించాలని ఆదేశించారు. ఆపదలో స్పందించి, ప్రాణాలు నిలబెట్టిన మంత్రి కేటీఆర్‌కు రమేశ్ భార్య అరుణ, పిల్లలు స్వాత్విక్, ప్రగతి, బావ మరిది అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

- Advertisement -