మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..

240
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నామని, తమను ఆదుకోవాలని పలువురు మంత్రి కేటీఆర్‌ను సంప్రదించగా మానవతా దృక్పథంతో వారికి సహాయాన్ని అందించిన మంత్రి కేటీఆర్‌ తాజాగా ఓ చిన్నారికి సాయమందించి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. చిన్నవయస్సులోనే బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిని బాలుడు భాను ప్రసాద్(4)కు మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. బాలుడి వైద్యానికి మంత్రి కేటీఆర్ తన సహాయం అందించారు.

KTR

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం రగుడు గ్రామానికి చెందిన ఇటికల దేవయ్య-నాగలక్ష్మి దంపతులకు కొడుకు భానుప్రసాద్ (4) ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మూడున్నరేళ్ల క్రితం దేవయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగలక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ కొడుకు భాను ప్రసాద్ అలనాపాలన చూస్తున్నది. ఇటీవలే భానుప్రసాద్ అనారోగ్యం బారిన పడగా, బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో చేతిలో ఒక్క పైసా లేని నాగలక్ష్మి స్థోమత లేకపోవడంతో తన కొడుకుకు ఖరీదైన వైద్యం కోసం తమను ఆదుకోవాలని వేడుకుంది.

ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడంతో పలువురు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు మంత్రి కేటీఆర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. సత్వరమే మంత్రి కేటీఆర్‌ స్పందించి సోమవారం భానుప్రసాద్‌ను హైదరబాద్‌కు తీసుకురావాలని సూచించారు. బాలుడికి నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించనున్నారు. బానుప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ వైద్యం చేయిస్తానని పేర్కొనడంతో బాధితుడి తల్లి నాగలక్ష్మి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -