పూజా కె. దోషి, హరీశ్ కల్యాణ్, సాయి రోణక్, సుదర్శన్, మోహన్ రామన్, డా. మంజేరి షర్మిల, గురురాజ్ మానేపల్లి తదితరులు నటించిన కాదలి మూవీ ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పట్టాభి.ఆర్.చిలుకూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో వేడుకకు మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి ఆడియో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ పట్టాభి ఆర్. చిలుకూరి నా బాల్య మిత్రుడు. తన కల ఈ చిత్రమని తెలిపారు. చరణ్‌ని తానే ఈ ఫంక్షన్‌కి ఆహ్వానించాననీ, పిలవగానే చరణ్ వస్తానని చెప్పాడనీ, ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద స్టార్స్ మద్దతు పలకడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పెళ్లిచూపులు లాంటివి బెంచ్ మార్క్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ కింగ్‌లాగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
జీఎస్టీలో సినీ పరిశ్రమకు పన్ను రేటుని 28 శాతంగా నిర్ణయించారనీ, దీన్ని కమల్‌హాసన్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలుగు సినీ పరిశ్రమతోపాటు పన్ను రేటు తగ్గింపు విషయమై కలిసొచ్చే అన్ని సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో కేంద్రం వద్దకు ఓ బృందాన్ని తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు.
రామ్‌ఛరణ్ మాట్లాడుతూ దాసరిగారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది కాబట్టి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మిస్ యూ దాసరిగారు. ఈ సినిమా విషయానికి వస్తే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. సురేశ్‌గారు జీఎస్‌టీ గురించి చెప్పగానే స్పందించినందుకు కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో మోస్ట్ ఫేవరేట్ చిత్రం నా కెరీర్‌లో ఆరంజ్. అలాంటి సినిమాను మరలా మరలా చేయాలని అనుకుంటాను. అలాంటి కళ, కలర్స్ ఉన్న ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్యాషన్‌ని నమ్మి చేస్తున్న పట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయలేదేమో. వాళ్లు అంత బాగా చేశారు అని చెప్పారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. “కొత్తవాళ్లతో సినిమా అనగానే నటీనటులు ఎలా ఉంటారోననే భావన ఉంటుంది. కానీ ఈ సినిమాలో నటులు బావున్నారు. పట్టాభికి ఉన్న అనుభవంతో అందరి దగ్గర నుంచి మంచి ఔట్‌పుట్ తీసుకుని ఉంటాడని భావిస్తున్నాను” అన్నారు.
దశరథ్ మాట్లాడుతూ.. “పట్టాభికి మంచి అవగాహన ఉంది సినిమా పరిశ్రమ మీద. తను పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో చాలా కలివిడిగా ఉండేవాడు. ఈ సినిమా సంగీతం బావుంది. ట్రైలర్స్ చూస్తుంటే ప్రేమదేశం సినిమా లాగా ఉంది” అన్నారు.
సంగీత దర్శకులు ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ మాట్లాడుతూ.. “ఇది మా రెండో సినిమా. మా తొలి చిత్రం మలుపు. పట్టాభిగారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. “పట్టాభి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తన అభిప్రాయాలను కచ్చితంగా చెబుతాడు. ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలి. మేం ఏం అడిగినా కేటీఆర్‌గారు చేస్తారు. జీఎస్‌టీ ప్రాబ్లమ్ ఉందని గతంలో ఒకసారి చెప్పినప్పుడు వెంటనే అరుణ్ జైట్లీ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమాకి జీఎస్‌టీని 28 శాతానికి పెంచారు. దీని వల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో పెద్ద, చిన్న చిత్రాలకు ఒకే రకమైన శాతం కాకుండా, ప్రాంతీయ చిత్రాలకు మరోలా ఉంటే బావుంటుంది. తెలుగు పరిశ్రమకు ఎప్పటినుంచో మద్దతిస్తున్న కేటీఆర్‌గారు ఈ విషయంలోనూ సహకరించాలి.“ అని తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ.. “తెలుగు సినిమాకి తమిళ్ టైటిల్ పెట్టినప్పుడే అందులో ఏదో ఉందని అనిపిస్తుంది. “హ్యాపీడేస్, పెళ్లి చూపులు” తరహాలో “కాదలి” కూడా పెద్ద హిట్ అవ్వాలి” అన్నారు.
వనమాలి మాట్లాడుతూ.. “సంగీత దర్శకులు మంచి సంగీతాన్నిచ్చారు. ఆనంద్‌గారు ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు “కాదలి” మంచి విషయం సాధించి.. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు!
పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.