పాత చాంబర్లు చూసుకుందాం..హరీష్‌తో కేటీఆర్‌ ఫన్

526
ktr harish
- Advertisement -

నూతన సచివాలయం,అసెంబ్లీ భూమి పూజ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్‌ రావు. కొత్త సెక్రటేరియట్ శంకుస్ధాపనకు మంత్రులు,అధికారులతో పాటు హరీష్‌-కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరి మధ్య సంభాషణ అందరిని ఆకట్టుకుంది. బావ మళ్లీ కుదరదేమో ఒక సారి మన పాత చాంబర్లు చూసుకుందాం అంటూ హరీష్‌తో కేటీఆర్ సరదాగా సంభాషించారు. దీనికి సరేనంటూ హరీష్ నవ్వూతు సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా హరీష్ కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హరీష్ మాత్రం సిద్దిపేటలో కాళేశ్వరం ప్రారంభోత్సవ సంబరాల్లో పాల్గొని సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు. అయినా హరీష్‌కు టీఆర్‌ఎస్‌కు గ్యాప్ పెంచేందుకు పలువురు ప్రయత్నించగా తాజాగా సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని సరదాగా అందరిని పలకరిస్తూ ఆ రూమర్స్‌కి మరోసారి చెక్ పెట్టారు హరీష్‌.

- Advertisement -