బాలిక ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్ మిత్రుడు

283
ktr Friend

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. తాజాగా కర్ణాటకకు చెందిన శిల్పారెడ్డి అనే బాలిక తన ఆరోగ్యంపై కేటీఆర్ కు ట్వీట్ చేసింది. అది చూసిన కేటీఆర్ వెంటనే తన ఆఫీస్ సంప్రదించమని చెప్పారు. అది చూసిన కేటీఆర్ ఫ్రెండ్ ఒకరు తన ఆపరేషన్ కు కావాల్సిన డబ్బులను అందజేశారు.

కాగా ఇవాళ కేటీఆర్ చేతుల మీదుగా రూ.90వేలను ఆ బాలిక తండ్రికి అందజేశారు. స్పీనల్ కోర్డ్ కాలు ఆపరేషన్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ.10లక్షలు ఇచ్చారని కానీ ఇప్పుడు కాలు ఆపరేషన్ కు మరో రూ.90వేలు అవరసంర ఉందని ట్వీట్ చేసింది. మహారాష్ట్ర బాలికకు సహాయం చేసిన తన మిత్రుడికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి సత్యవతిరాధోడ్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి లు పాల్గోన్నారు.