మురుగునీటి వ్యవస్ధ మరింత బలోపేతం: కేటీఆర్

275
KTR for improving drainage system in city
- Advertisement -

హైదరాబాద్ మురుగు నీటి వ్యవస్ధను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సోమవారం రోజున ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నగర సేవరేజ్ వ్యవస్థ, ఎస్టిపిలపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, ఐఎఎస్, జలమండలి ఎండి ఎం. దానకిశోర్, ఐఎఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న సేవరేజ్ వ్యవస్థ, ఎస్టిపిలు, రానున్న రోజుల్లో నిర్మించే ఎస్టిపిల సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండి మాట్లాడుతూ.. ఇప్పటికే 25 ఎస్టిపిల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసి మూసి నదిలోకి వదులుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగు నీరు మెత్తం శుద్ది చేయాలన్న దీర్ఘకాలిక అంతిమ లక్ష్యం దిశగా ముందుకు పోతున్నట్లు తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో సేవరేజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.నూతన ఎస్టిపిల నిర్మాణానికి స్థలం కోసం అన్వేషించకుండా ఇప్పటికే ఉన్న ఎస్టిపిల ప్రాంతంలో నూతన ఎస్టీపిల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. నూతన ఎస్టీపిల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నిధులు సేకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే కూకట్ పల్లి నాలాపై వర్టీకల్ ఎస్టీపి నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి,వీలయినంత త్వరగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

KTR For Improving Drainage System In City

 

నూతన ఎస్టిపిలు అందుబాటులోకి వస్తే నదిలోకి శుద్ధి చేసిన నీరు వదలడం ద్వారా నది కలుషితం కాకుండా సంరక్షించవచ్చని అభిప్రాయపడ్డారు. ఓఆర్ఆర్ లోపల సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా ఎఫ్ఎస్టీపిల(ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా భూగర్భ జలం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే చెరువులు, కుంటలను కపడుకోవచ్చని వివరించారు. అలాగే ఫంక్షన్ హాలు, హోటల్స్, హాస్టల్స్, ఆసుపత్రిలాంటి వాణిజ్య భవనాలకు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకునేలా అవగాహన పెంచాలని సూచించారు. తద్వారా సేవరేజ్ వ్యవస్థలోకి చెత్తచెదారం వెళ్లకుండా అడ్డుకుంటుందని తెలిపారు. సిల్ట్ ఛాంబర్లు లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నగరంతో పాటు ఓఆర్ఆర్ లోపల 100 అంత కంటే ఎక్కువ ఫ్లాట్ లు ఉన్న అపార్ట్ మెంట్లు తప్పనిసరిగా ఎస్టీపి నిర్మించుకోవాలని మున్సిపల్ చట్టంలో ఉందని తెలిపారు. ఈ అపార్ట్ మెంట్లలో ఎస్టిపిలు నిర్మించుకునేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే 100 కు మించి ఫ్లాట్ లు ఉన్న అపార్ట్ మెంట్లు ఎన్ని ఉన్నాయి. అందులో ఎన్ని ఎస్టిపిలు నిర్మించుకున్నాయనే నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఎస్టిపిలు నిర్మించుకోని అపార్ట్ మెంట్లపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -