నగర అభివృద్ధి కోసం కృషి చేద్దాం-కేటీఆర్

235
- Advertisement -

జీహెచ్‌ ఎంసీ కార్పొరేటర్లు, అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖాధికారులు, రంగారెడ్డి, మేడ్చేల్, హైదారాబాద్ కలెక్టర్లు, రాష్ర్ట మునిసిపల్ శాఖాధికారులు ఈ సమన్వయ సమావేశానికి హజరయ్యారు. నగరంలోని ప్రజల కనీసావసరాలైన పార్కులు, పారిశుద్యం, రోడ్ల నిర్వహాణ, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కార్పోరేటర్లకు, అధికారులను కోరారు.

KTR for improving drainage system in city

విశ్వనగరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నగర అభివృద్ధిపైన ప్రత్యేకమైన విజన్ ఉందని, ఈ దిశగా జిహెచ్ఎంసిని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల వారీగా తెలిపిన సమస్యలను విన్న మంత్రి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాకుండా కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు అందరం కలిసి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

KTR for improving drainage system in city

జిహెచ్ఎంసి నుంచి ప్రజలు అద్భుతాలేమి, ఆశించడం లేదని వారి యొక్క కనీస అవసరాలను తీర్చితే సరిపోతుందన్న మంత్రి, ఆ దిశగా పనిచేద్దామన్నారు. వాటర్ సప్లై, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అంశాలపైనే ప్రధానంగా తమ దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. కార్పోరేటర్లగా ఎన్నికై ఇప్పటికే సంవత్సరన్నర దాటిందన్న మంత్రి, ఇకపై నిరంతరం ప్రజల్లో తిరగాలని కోరారు. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వారి వెంట ఉంటే సరిపోతుందని, ప్రజల కష్టసుఖాలను పంచుకోవాలని కోరారు. ప్రజల అవసరాలను తీర్చేలా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. సర్కిళ్ల స్థాయిలో నిర్వహిస్తున్న ఉమ్మడి సమన్వయ సమావేశంలో ఇకపై కార్పోరేటర్లను కూడా భాగస్వాములను చేసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

KTR for improving drainage system in city

కార్పొరేటర్లు ప్రస్తావించే సమస్యలపట్ల సాధ్యమైనంతవరకు సానుకూలంగా స్పందించాలని అధికారులను కోరారు. తమ డివిజన్లను అభివృద్ధి చేసుకునేందుకు కార్పోరేటర్లకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తమ డివిజన్ లేదా వార్డులను అదర్శంగా తీర్చిదిద్దితే ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టి, రెవెన్యూ అధికారుల సహాకారంతో కాపాడాలన్నారు. మరోపైపు ప్రభుత్వానికి గౌరవం తెచ్చేలా నడుచుకోవాలని కార్పొరేటర్లకు ఈ సందర్భంగా గుర్తు తెలిపారు. తమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు, తమ డివిజన్లలో కావాల్సిన పనుల వివరాలను మంత్రికి అందించారు. కార్పోరేటర్ల అందించిన సమస్యలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని హాజరైన వివిధ శాఖల అధికారులు మంత్రి ఆదేశించారు.

- Advertisement -