మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..

424
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌కు మరో ప్రముఖ అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌ – 2020 సమావేశంలో పాల్గొనాల్సిందిగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు కేటీఆర్‌ని కోరారు. అమెరికా బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఫిబ్రవరి 15,16 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్ -2020 జరగనుంది.

17వ ఇండియా కాన్ఫరెన్స్ – 2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందగా ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. ఈ సమావేశానికి ఇరు దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. భారతదేశంలో స్మార్ట్ సిటీలు అనే అంశంపై మాట్లాడనున్నారు కేటీఆర్.

- Advertisement -