- Advertisement -
రేపు అచ్చంపేటలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అచ్చంపేట జన గర్జన సభకు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లను పరిశీలించారు మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్మనీ రైన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి దగ్గరుండి పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
- Advertisement -

