తెలంగాణ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకుపోతున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ …టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు.
సమైక్య పాలనలో అన్ని రంగాలు కునారిల్లిపోయాయి……కానీ తెలంగాణలో ఆ పరిస్ధితి మారి ఇవాళ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. పరిశ్రమలకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుముతులు ఇస్తున్నామని చెప్పారు.
కాలుష్యత రహిత పార్క్ ల ఏర్పాటుతో పర్యావరణంకి ఎలాంటి హాని జరగదన్నారు. 450 ఎకరాల్లో ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను భవిష్యత్తు లో 2 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తాం…….అందులో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే అనుమతులు ఇస్తాం అన్నారు.ఈ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కుతో 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు.
పారిశ్రామిక వాడల్లో అన్ని రకాల మౌళిక వసతులను ప్రభుత్వం తరపున కల్పిస్తాం అని చెప్పిన కేటీఆర…. పరిశ్రమలు రావాలి,ఉపాధి అవకాశాలు పెరగాలి అనేది మా అభిమతం అన్నారు.
ఈ గ్రీన్ పార్క్ లో 10 ఎకరాల స్థలంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం…….ఉద్యోగుల నివాసం కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లను ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మిస్తున్నాం అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం అని చెప్పారు.