విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్

74
KTR embarks on two-week foreign tour

ఈ నెల 23 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనే నిమిత్తం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు విదేశీ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా దక్షిణ కొరియా, జపాన్, స్విట్టర్లాండ్ లో ఆయన పర్యటించనున్నారు.

ఈ నెల 15 నుంచి 22 వరకు దక్షిణ కొరియా, జపాన్ ను ఆయన సందర్శించి, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చిస్తారని, ఎంఎన్ సీ ల నుంచి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా పారిశ్రామిక పార్కులను కేటీఆర్ సందర్శించనున్నట్టు సమాచారం.