పద్మారావుకు మద్దతుగా కేటీఆర్ ఎన్నికల ప్రచారం

19
- Advertisement -

సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 2న సాయంత్రం 4 గంటలకు జూబ్లీ హిల్స్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. 3న ఖైరతాబాద్‌, నాంపల్లిలో ప్రచారం ఉండనుంది.

అలాగే ఈ నెల 5న అంబర్‌పేట, ముషిరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా 7న సికింద్రాబాద్,సనత్ నగర్‌, ఖైరతాబాద్‌లో రోడ్‌ షోల్లో పాల్గొననున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ గెలిచే ఫస్ట్ స్థానం సికింద్రాబాదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -