గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద ట్యాబ్‌లు పంచిన మంత్రి కేటీఆర్‌

66
gift asmile
- Advertisement -

మానవ సమాజానికి విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని వెల్లడించారు. మన ఊరు-మన బడి కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు.

సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని చెప్పారు. దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్‌ సైకిళ్లు అందించామని కూడా తెలిపారు.

పేద విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ అందిస్తున్నామని దీని ద్వారా ప్రతి విద్యార్థికి విద్య చెంతనే ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేశామని వెల్లడిచారు. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు.

విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు.

- Advertisement -