మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు ఇవ్వాలి: కేటీఆర్

4
- Advertisement -

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డినే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు.

ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగిందన్నారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండి అని కేటీఆర్ సూచించారు.

- Advertisement -