పేద విద్యార్థుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…తమిళనాడులోని ఎయిడ్ స్కూళ్లలో కూడా ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ట్వీట్ చేశారు.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిందన్నారు. దానిని మరింతగా విస్తరించాలని కూడా భావించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలుచేయాలని కోరారు.
It’s truly unfortunate that the Congress Govt has cancelled this wonderful initiative in Telangana
KCR Government had launched the breakfast scheme for students & had planned to expand it also but now …..
Request the Govt to reconsider their unwise decision and implement the… https://t.co/PZJvWI0a8n
— KTR (@KTRBRS) July 16, 2024
Also Read:Dandruff:డాండ్రఫ్‌కి వీటితో చెక్..!