KTR:ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయండి

4
- Advertisement -

న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.శాస‌న‌స‌భ‌లో సివిల్ కోర్టుల స‌వ‌ర‌ణ బిల్లును శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ బిల్లును స‌మ‌ర్థిస్తూ, స్వాగ‌తిస్తున్నామ‌ని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత‌లు న్యాయ వ్య‌వ‌స్థ‌కు రాజ్యాంగంలోనే బ‌ల‌మైన పునాదులు వేశారు.

రాజ‌కీయంగా విబేధాలు ఉన్న‌ప్ప‌టికీ న్యాయ వ్య‌వ‌స్థ‌ను కాపాడేందుకు స‌మిష్ఠిగా క‌లిసి ప‌ని చేయాలి. అత్యాచారాలు, సైబ‌ర్ క్రైమ్ బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవ‌స‌ర‌మైతే ప్ర‌తి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితుల‌కు వెంట‌నే శిక్ష ప‌డేలా చేయాలి. దీంతో మిగ‌తా వారెవ్వ‌రూ కూడా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌రు అన్నారు.

దేశంలో కొత్త చ‌ట్టాలు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే కేంద్రం కొత్త న్యాయ చ‌ట్టాలు తెచ్చింది. ఈ చ‌ట్టాల వ‌ల్ల మ‌న‌కు ఏమైనా ఇబ్బంది క‌లుగుతుందా..? అని సందేహాలు క‌లుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో వామ‌ప‌క్ష ఉద్య‌మాలు, ప్ర‌జా సంఘాలు క్రియాశీలంగా ఉన్నాయి. గ‌తంలో ఎంతో మంది ఉద్య‌మాలు చేసి అసువులు భాసారు. కొత్త చ‌ట్టాల వ‌ల్ల తెలంగాణ పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహం ఉందన్నారు. కాంగ్రెస్ కూడా కొత్త చ‌ట్టాల విష‌యంలో స‌వ‌ర‌ణ‌లు చేయాలి. పోలీసు రాష్ట్రం, రాజ్యంగా మార‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

ప్ర‌ధాని నుంచి సీఎంలు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీక‌ర్ల మీద వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. దీనికి ఎవ‌రు అతీతులు కాదు. నెహ్రూ పాల‌న నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతూనే ఉన్నాయి. అంద‌రం బాధితుల‌మే అని సోషల్ మీడియా మీమ్స్‌పై స్పందించారు కేటీఆర్.

Also Read:Rahul:ఈడీతో దాడికి ప్లాన్..ఛాయ్‌- బిస్కెట్‌తో రెడీ

- Advertisement -