టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందిరికి తెలిసిందే. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా ద్వారా తనకు అందిన ఫిర్యాదులను సైత పరిష్కరించడంలోనూ ముందే ఉంటారు. అంతేగాదు పొలిటికల్ సెటైర్లు వేయడం,ఆసక్తికర ప్రశ్నలను సైతం సంధిస్తుంటారు.
తాజాగా తన కూతురు అలేఖ్య అడిగిన ప్రశ్నను నెటిజన్లతో పంచుకున్నారు కేటీఆర్. నా పదేళ్ల కూతురు ‘మీ జీవితంలో ఇప్పటివరకూ చేసిన క్రేజియెస్ట్ పని ఏది?’ డాడీ అంటూ రాత్రి నన్ను ప్రశ్నించింది. ఎంత సేపు ఆలోచించినా సమాధానమే దొరకలేదు అని ట్వీట్ చేశారు . ఇక నా బకెట్ లిస్టులో కొన్ని అంశాలు చేర్చాల్సిన తరుణం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.
My 10 year old baby girl asks me last night; ‘Dada, what’s the craziest thing you’ve ever done’? Had no answers even after digging deep😯
Have begun to think 🤔 may be its high time to start putting things on my #BucketList #NewLifeGoals
— KTR (@KTRTRS) February 22, 2019