ఉత్తమ్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్..

153
Ktr counters Uttamkumar
- Advertisement -

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ‘ఉత్తమ్‌గారూ.. నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్‌ చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగానే మంత్రి కేటీఆర్ కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆ స‌ద‌స్సుకు వెళ్లారని, అంతేకానీ ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందలేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్‌, ఈమెయిల్‌ కాపీలు ఇవేనంటూ ప‌లు ఫొటోల‌ను పోస్ట్ చేశారు.

- Advertisement -