టాలీవుడ్‌కి దక్కిన గౌరవం ఇది: కేటీఆర్‌

589
ktr mahanati
- Advertisement -

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై హర్షం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. తెలుగు సినిమాకు దక్కిన గౌరవం ఇది అని కొనియాడారు. మహానటి చిత్ర యూనిట్‌కి కీర్తి సురేష్‌కు విషెస్ చెప్పారు కేటీఆర్.దీంతో పాటు రంగస్థలం,అ!,చిలసౌ చిత్రాలకు అవార్డులు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది.

1990లో కర్తవ్యం సినిమాతో విజయశాంతి ఉత్తమ నటిగా అవార్డు అందుకోగా.. 28 సంవత్సరాల తర్వాత మహానటి సినిమాతో కీర్తీ సురేష్ ఈ అవార్డును కైవసం చేసుకుంది. 1967 నుంచి జాతీయ చలన చిత్ర అవార్డులను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 52 సార్లు ఈ అవార్డులు ప్రకటించారు.

- Advertisement -