రాష్ర్టంలోని పట్టణాలను పరిశుభ్ర పట్టణాలుగా తీర్చి దిద్దేందుకు పనిచేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ రోజు సచివాలయంలోని సి బ్లాక్ నుండి రాష్ర్టంలోని మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. పట్టణాల్లోని పారిశుద్ద్యం, హరిత హారం, పట్టణాల్లో ఏల్ ఈడి లైట్ల భిగింపు వంటి అంశాల మీద పలు అదేశాలను జారీ చేశారు. వచ్చె నెల 15 నాటికి రాష్ర్టంలోని అన్ని పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జణ రహిత పట్టణాలుగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు మున్సిపాలీటీలు ఈ లక్ష్యాన్ని సాధించాలని లేకుంటే అయా మున్సిపాలీటీల కమీషనర్ల మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిధులకు ఏలాంచి కోరత లేదని, అవసరం అయితే తమ వద్ద ఉన్నఏల్ అర్ యస్ నిధులు వాడుకోవాలన్నారు. వీటిని వేంటనే రిఎంబర్స్ చేస్తామన్నారు. ఎట్టిపరిస్ధిల్లో టాయిలెట్ల నిర్మాణం అగవద్దని, యద్దప్రతిపాధికన ప్రతి మున్సి పాలీటీ ఒడియప్ స్టేటస్ అందుకోవాలన్నారు. ఇప్పటికే మధిరా, భైంసా, భోనగిరి, ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి, అచ్చంపేట్, హుజురాబాద్, హుజూర్ నగర్, గజ్వేల్, జగిత్యాల్, శాద్ నగర్, సూర్యపేట్, సిద్దిపేట, సిరిసిల్లా, బోడుప్పల్, నర్సంపేట్ మున్సిపాలీలు ఇప్పటికే ఒడియప్ స్టేసస్ పొందాయని మంత్రి తెలిపారు. అయా పట్టణాల్లోని కమీషనర్లను మంత్రి అభినందించారు. ఈ కమీషనర్లు తమకు దగ్గరలో ఉన్న పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సహాకరించాలన్నారు.
వర్షకాల సన్నధ్దతపైన మంత్రి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వర్షకాలం సందర్భంగా పారిశుద్ద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పట్టణాల్లో పరిశుభద్రతపైన ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద చూపించాలని అదేశాలిచ్చారని ఈ నేపథ్యంలో శిథిల భవానాలు, నాలలపై కబ్జాల తొలగింపు, నాలల పుడికతీతప పనులను వేంటనే పూర్తి చేయాలన్నారు. వచ్చెనెల రెండోవారంలో పట్టణాలకు స్వచ్చ అటోలను అందజేస్తామన్నారు. వచ్చే దీపావళి నాటికి అన్ని పట్టణాల్లో ఏల్ ఈడీ లైట్ల వెలుగులు ఉండాలని, ఈ మేరకు దీపావళి నాటికి పట్టణ వీధీధీపాలను ఎల్ ఈ డీ లైట్లకింద మార్చాలన్నారు.
ప్రభుత్వం మున్సిపాలీటీలకు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు మెక్కలు నాటాలని, హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టణాల్లోని డంప్ యార్దుల్లో సాద్యమైనన్ని ఎక్కువ సువాసనాలు వెదజల్లే మెక్కలు నాటాలన్నారు. పట్టణ మిషన్ భగీరథ పనులను అర్ అండ్ బి, పంచాయితీరాజ్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. పలు పట్టణాలు అభివృద్దిలో, కార్యక్రమాల అమలులో ముందు వరసలో ఉన్నాయని, వీటి యెక్క అనుభవాలతో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సిడియంఏ శ్రీదేవిని అదేశించారు. త్వరలోనే మున్సిపల్ కమీషనర్లు, చైర్మన్లతో హైదారాబాద్లో ఒక విస్తృతస్ధాయి సమావేశం ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సిడియంఏ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గోన్నారు.