ఎవడెవడో బీజేపీలోకి బీఆర్ఎస్ పోతుందని మాట్లాడుతున్నాడు.. మనకేం కర్మ తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుంది అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదలు పెట్టిన పరిగి మండలం కాంగ్రెస్ నేతలు అంతా ఆ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పిచ్చికూతలేనన్నారు. హోంమంత్రిగా పని చేసిన సబితమ్మ మీద పోలీసులు ఎగురుతున్నారు…ఐఏఎస్,ఐపీఎస్ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
మరో మూడేళ్ళలో మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు అతి చేసే, అబద్దాలాడే ఒక్కొక్కరికి ఇసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది అని తెలిపారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు కచ్చితంగా ఎత్తేస్తారు… కాంగ్రెస్ గెలిస్తే రైతుబందు రాం రాం అయితదని కేసీఆర్ ఆనాడే చెప్పాడు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రైతుబంధు తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు అన్నారు.
Also Read:నిరుద్యోగ హామీలు.. BRSV ప్రత్యేక గూగుల్ స్కానర్

