KTR: బీజేపీలో విలీనం తప్పుడు వార్తలే

6
- Advertisement -

బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎక్స్ ద్వారా స్పందించిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి… లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ హెచ్చ‌రించారు. ప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏండ్ల‌ పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప‌థాన‌ నిలిపాము అని కేటీఆర్ తెలిపారు.

Also Read:KTR: ఛిద్రమవుతున్న చేనేత బ్రతుకులు

- Advertisement -