అక్రమ అరెస్ట్‌లు..ఏడో గ్యారెంటీనా?: కేటీఆర్

13
- Advertisement -

బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారు అని మండిపడ్డారు.

 

Also Read:ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది: నిర్మాతలు

- Advertisement -