KTR: సీఎం రేవంత్ ప్రొద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ప్రొద్బలంతోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? అన్నారు.

ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని..కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు అన్నారు.

ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదరం. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు అని హెచ్చరించారు.

 

Also Read:KTR:రైతుల ప్రాణాలు తీస్తున్న సీఎం రేవంత్

- Advertisement -