- Advertisement -
బిఆర్ఎస్ పార్టీ నేతల పైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు కేటీఆర్.
వివరాలు అడిగి తెలుసుకుని పార్టీ అండగా ఉంటుందని తెలిపారు కేటీఆర్. వెంటనే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వివేక్లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లాలని సూచించారు కేటీఆర్.
దీంతోపాటు జూబ్లీహిల్స్ లో కార్పొరేటర్ దేదీప్యపైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండించారు కేటీఆర్. దేదీప్య తో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర నగర నేతలు దేదీప్యను పరామర్శించనున్నారు.
Also Read:YSRCP:చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!
- Advertisement -

