బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడిని ఖండించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. దాడి చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదే కాంగ్రెస్ అరాచక పాలన తీరు అంటూ ధ్వజమెత్తారు.బాధ్యులపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు.
ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి గూండాలు పోలీసుల ఎదుటే దాడి చేసినా.. ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేరుకే ప్రజాపాలన కానీ దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు!
బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు.… pic.twitter.com/jLaoyu0HhJ
— KTR (@KTRBRS) January 22, 2025
Also Read:దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం