ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం:కేటీఆర్

6
- Advertisement -

ప్రజల తరపున ప్రశ్నిస్తాం, హామీల అమలుకు నిలదీస్తాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్…అతను హత్య చేయలేదు,అతను దొంగతనం చేయలేదు ,అతను ఎవరి మీదా దాడి చేయలేదు,అతను తీవ్రవాది కాదు,అతను మావోయిస్టు కాదు,అతను మావోయిస్టుల సానుభూతిపరుడు కూడా కాదు,అతను మాజీ నేరస్తుడు కానే కాదు,అతను శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలిగించలేదు , అతను శాంతిభద్రతలు భంగం కలిగించేలా ఎవరిని రెచ్చగొట్టలేదు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్నాడు.. హామీల అమలు గురించి సోషల్ మీడియాలో పోస్టులను రీపోస్ట్ చేస్తున్నాడు అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాడిని పట్టుకున్నట్లు రాత్రి వేల తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేశారు… హత్యాయత్నం చేసిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఎక్కడ తన పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాలను మాయం చేస్తాడో అన్నట్లు, సాక్షులను ప్రభావితం చేస్తాడో అన్నట్లు,ఎవరినీ కలవనివ్వకుండా పారిపోతాడు అన్నట్లుగా పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి తన కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నది అన్నారు.

రాజ్యాంగం చేతిలో పట్టుకొని నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ నీ కళ్లకు కానరావడం లేదా ?, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలు మీ చెవికి వినపడడం లేదా ?, కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా ?,చెరసాలకు భయపడితే తెలంగాణ వచ్చేదా ? అని ప్రశ్నించారు.

Also Read:బుల్డోజర్ రాజ్‌పై హరీశ్ రావు ట్వీట్

- Advertisement -