ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి కేటీఆర్. బాధ్యులను కఠినంగా శిక్షించాలని… జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు స్థానం ఉండదని .. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు. జగన్‌పై జరిగిన దాడి అమానుషం అని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదని పవన్ అన్నారు. ఈ హత్యాయత్నానికి ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు @ysjagan గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
— KTR (@KTRTRS) October 25, 2018
జగన్‌పై దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్ సహా అన్ని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు.
జగన్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ..అసలు కత్తి విమానాశ్రయంలోకి ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతోందన్నారు. జగన్‌పై దాడి చేసిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందిన జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. పబ్లిసిటీ కోసమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని డీజీపీ వ్యాఖ్యానించారు.
మరోవైపు దాడి అనంతరం ప్రాధమిక చికిత్స చేసుకున్న జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకోగానే అపోలో వైద్యులు ఆయన గాయాన్ని పరిశీలించారు.
Strongly condemn the attack on Opposition Leader @ysjagan garu that happened at Vizag airport. Such cowardly attacks have no place in the modern society.
— Lokesh Nara (@naralokesh) October 25, 2018