రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి ముందుజాగ్రత్త చర్యగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆసుపత్రిగా మార్చింది. గచ్చిబౌలిలోని 13 అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రి ప్రారంభంకావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికైతే హాస్పిటల్‌ను కోవిడ్-19 బాధితులకు చికిత్స అందిచేందుకు వినియోగిస్తామని కేటీఆర్ చెప్పారు. కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చి వైద్యసేవలు, పరిశోధనలు నిర్వహిస్తామని వెల్లడించారు. కేవలం 20రోజుల వ్యవధిలో స్పోర్ట్స్ టవర్‌ను 1500 పడకలతో అధునాతన హాస్పిటల్‌గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు ఆయన టీమ్‌ను కేటీఆర్ అభినందించారు.
My compliments to Health Minister @Eatala_Rajender Garu & his team on a fabulous job of converting the sports tower into Telangana Institute of Medical Sciences with 1500 beds 👍
All this done in less than 20 days 👏
Initially will be exclusive to #TelanganaFightsCorona 1/2 pic.twitter.com/If7SHcamez
— KTR (@KTRTRS) April 21, 2020