తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ తగ్గలేదని, గణేష్ ఉత్సవాల్లో ఆ విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు.మండపాల వద్ద ఎక్కడ చూసినా ప్రజలు “దేఖ్‌లేంగే.. కేసీఆర్” అంటూ నినదిస్తున్నారని, ఇది కేసీఆర్ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని తెలిపారు.
కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు, లబ్ధిపొందిన రైతులు ప్రతి ఒక్కరూ ఆయనను నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:Ind Vs WI:వన్డే ట్రాక్ రికార్డు!
రాష్ట్ర అభివృద్ధి, బహుజన సంక్షేమం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని విశ్వసించి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు కేటీఆర్.

