హుజూరాబాద్‌ ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదు- మంత్రి కేటీఆర్‌

88
ktr
- Advertisement -

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. గత 20 సంవత్సరాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఆటుపోట్లు చూసిందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని, ఈ ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక కోసం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల బాగా శ్రమించారని కొనియాడారు. అలాగే ఎమ్మెల్యేలు నేతలు, కార్యకర్తలతో పాటు సోషల్‌ మీడియా వారియర్స్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌ పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -