ఔదార్యంలో అచ్చం పెద్దాయనే…

270
ktr
- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్న కేసీఆర్ బాటలో సైనికుడిగా పనిచేస్తున్న కేటీఆర్ పాలనలోనూ తనదైన శైలీతో దూసుకుపోతున్నారు. గతంలో ఐటీ మంత్రిగా హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు తీసుకువచ్చిన కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనమార్క్‌ని చూపిస్తున్నారు.

ఓ వైపు పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతునే మరోవైపు తన నియోజకవర్గమైన సిరిసిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతూనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న కేటీఆర్ తాజాగా ఓ పేదింటి యువతి పెళ్లికి తనవంతు సాయం అందించారు.

Image result for ktr mounika marriage

చిన్నప్పుడే తల్లిదండ్రులను కొల్పోయి నానమ్మ దగ్గరే పెరిగిన యువతి పెళ్లికి ఆర్థికసాయం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామానికి చెందిన మౌనిక పెళ్లికి ఆయన రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు పెళ్లి పందిట్లో మౌనికకు డబ్బును అందించారు. కేటీఆర్ చేసిన సాయానికి మౌనిక కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -