గోదావరి, కృష్ణా నది జలాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విచ్చల విడిగా ఏపీ ప్రభుత్వం జల దోపిడీ జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. భారీ భూకంపం వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరలేదు అన్నారు.28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిన తట్టుకొని నిలబడింది… కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు చేస్తుంది తప్ప ఇంకోటి కాదు అన్నారు.
ఆడిత్యనాధ్ దాస్ ను ఇక్కడ నీటిపారుదల శాఖ సలహాదారు గా పెట్టుకున్నారు. ఇది మరీ చంద్రబాబు నాయుడు చెప్పారని ఏమో తెల్వదు కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతన్ని ఎలా పెట్టుకున్నారు… కృష్ణా నది జలాల వాడకం లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్నారు. గోదావరి నది జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ను ఎండబెట్టారు.. అదిత్యనాధ్ దాస్ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు అన్నారు.
ఈ వరంగల్ సభ నుండి బీజేపీ ని కాంగ్రెస్ పార్టీలపై ఉంటుంది ,బీజేపీ ఎం చేసిందని,కాంగ్రెస్ ప్రభుత్వం ఎం చేసిందని బలంగా ఉంటుంది,ఢిల్లీ పార్టీలను నమ్ముతామా…..తెలంగాణ రాష్ట్రం కు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ వైపునా.. క్రూడాయిల్ రేట్లు తగ్గితే డీజిల్,పెట్రోల్ రేట్లు తగ్గాలి కానీ పెరగడం ఏంటి చెప్పాలన్నారు.
సన్న బియ్యం ప్రవేశపెట్టడం చేసిందే మేము.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎం తెలీదు కాంగ్రెస్ ప్రభుత్వం, లోక్ సభ నియోజకవర్గాల కు సంబంధించి పీఎం అపాయింట్మెంట్ ఆడిగం అని స్టాలిన్ చెప్పాడు అపాయిట్మెంట్ ఇవ్వలేదు… దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మొదటి నుండి మేమే అడుగుతున్నాం.దక్షిణాది రాష్ట్రాల అన్యాయం పై గళం ఎప్పటి నుండో మేము లేవనెత్తిన పార్టీ మా పార్టీ,అధినేత కేసీఆర్ అన్నారు.