జిల్లాల తొలగింపుపై ప్రభుత్వాన్ని ఎండగడతాం!

5
- Advertisement -

జిల్లాల తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది …దీనితో చాలా చోట్ల ప్రజల్లో ఆందోళన ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్..కొత్త జిల్లాలు చేసిన పట్టణాల్లో జిల్లా లు ఎత్తేసారు అనే భావనలో ఉన్నారు..ప్రజలు అంత కూడా ఆందోళనలో ఉన్నారు…జిల్లాల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికల లో ప్రచారం చేస్తాం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నాయకుల డిసైడ్ చేస్తారు…ఎన్నికల కో ఆర్డినేటర్ లను పెడుతున్నాం…వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు అన్నారు.ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యే లను మున్సిపల్ ఎన్నికల దగ్గర ఇంచార్జ్ లుగా నియమిస్తాం… లోకల్ ఎన్నికలు కాబట్టి లోకల్ వాళ్ళే ప్రచరం చేస్తారు..స్థానికత ఆధారంగా ప్రచారం చేస్తామన్నారు.

స్థానిక సమస్యలను ఎజెండా గా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తాం..ముఖ్యమంత్రి హార్వర్డ్ వెళ్ళి మంచిగా తిరిగి వస్తారు అనుకుంటున్న …వచ్చిన అయిన ఇంగ్లీష్ లో మాట్లాడతాడు అనుకుంటాం…పఠాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మా బిఆర్ఎస్ పార్టీ నే గెలిపించాలి అంటున్నారు మేము కూడా అదే అంటున్నాం…పార్టీ మారిన తర్వాత ఆయా నియోజకవర్గాల లో వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు …సింగరేణి పై మంత్రులు మాట్లాడడం లేదు అన్నారు.

సింగరేణి పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి…ఒక్కవైపు ఫార్ములా ఈ అంటాడు.అందులో ప్రూవ్ చెయ్యి…ఇక్కడ ఫార్ములా ఈ పై విచారణ అంటాడు.అక్కడ దావోస్ లో గ్రీన్ కో తో చర్చలు జరుపుతున్నారు.ఒక్కదగ్గర మంచోళ్ళు అవుతారు,మరో దగ్గర చెడ్డోళ్ళు అవుతారు ఎలా.హైద్రాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండే..మేమేం మార్చలేదు.రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి..రేవంత్ రెడ్డి తుగ్లక్,సమాధానం చెప్పేవరకు ఆయన వెంబడి పడుతాం అన్నారు.

Also Read:ప్రయాగ్‌రాజ్‌లో విమాన ప్రమాదం

రేవంత్ లో రాము ఉన్నాడు రెమో ఉన్నాడు…ఉదాహరణకు సినిమా టికెట్లు పెంచం అంటాడు ,మరోవైపు సినిమా టికెట్ లు పెంచుతూ జివో ఇస్తారు.సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లా చేస్తాం అన్నారు కాని ఇప్పుడు మళ్ళీ అదే జిల్లా ను తొలగిస్తాం అన్నారు.అందుకే ఆయన రాము రెమో అని అన్నాను అన్నారు కేటీఆర్.

- Advertisement -