KTR: నా పై కేసు నిలబడదు

6
- Advertisement -

నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదు అని పొన్నం ప్రభాకర్ చెప్పాడు…ప్రోసిజర్ కరెక్ట్ గా లేదు అని అన్నారు.అంతేకాని అవినీతి లేదని అన్నారు అని గుర్తు చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రిని కూడా ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.తాను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానని కేసులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. కేసులను లీగల్ గానే ఎదుర్కొంటామని..తనపై కేసు నిలబడదన్నారు.

సిట్ అంటేనే ఆయన కోసం పని చేసే అధికారులు ఉంటారు…ప్రమోషన్ కోసం పని చేయాల్సిన వారు ఉన్నారు..నేషనల్ హైవే వాళ్ళు పెట్టిన టిఓటి ప్రకారమే వెళ్ళాం తప్ప ఇంకోటి లేదు అన్నారు. కేస్ ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదు..50 లక్షల తో పట్టుబడిన వ్యక్తి ఎసిబి కిందికి వస్తుందన్నారు.నిన్న హరీష్ రావు అప్పులపై అద్భుతంగా సభలో ప్రసంగించారు…దాన్ని వారు తట్టుకోలేదు.అప్పులు చేశారు అని నిరూపించడం తో కావాలని నిన్న కేస్ నమోదు చేశారు. అంతేకాదు సిట్ కూడా అందుకే వేశారన్నారు.

మంత్రులకు శిక్షణ తరగతులు పెట్టాలి.ఎమ్మెల్యేలకు పెట్టారు అందుకే చెప్పులు లేపారు.ఇదా వీరు ఇచ్చిన శిక్షణ చెప్పాలన్నారు.ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారు.అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగింది అని అన్నారు కదా…..మరి ఆ పర్మిషన్ రద్దు చేయాలి అన్నారు.

Also Read;అవినీతి లేదు అంటూనే అక్రమ కేసా: కౌశిక్ రెడ్డి

- Advertisement -