ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్…న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు అన్నారు.
అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది అని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు…నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ రెడ్డికి ఏమి దొరకటం లేదు అన్నారు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని…నాపై కేసు పెడితే.. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి అన్నారు. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు కేటీఆర్. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం….పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం…ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందన్నారు.
Also Read:దావత్‌లు మానండి..దాతలుగా మారండి