కోమటిరెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్…

42
- Advertisement -

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్..సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. కొంద‌రు శిఖండి రాజ‌కీయాలు, పిచ్చి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2000లో కేసీఆర్‌కు ఒక త‌మ్ముడిలాగా, ఉద్య‌మానికి ఆక‌ర్షితుడై జ‌గ‌దీశ్ రెడ్డి న‌డిచారు. ప‌ద‌వుల‌పై ఆకాంక్ష‌తో రాలేదన్నారు.

ఎన్ని ఎత్తులు, కుట్ర‌లు చేసినా.. జ‌గ‌దీశ్ రెడ్డి విజ‌యాన్ని ఆప‌లేరు.. ఆయ‌న విజ‌యం ప‌క్కా ఖ‌రారై పోయిందని జోస్యం చెప్పారు. క‌ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సూర్యాపేట‌ జిల్లా అయిందని… న‌ల్ల‌గొండ పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయిందన్నారు. క‌డుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉంది. కాబ‌ట్టి జ‌గ‌దీశ్ రెడ్డిని ఆశీర్వ‌దించి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

కేసీఆర్ మాత్ర‌మే తెలంగాణ‌కు న్యాయం చేయ‌గ‌ల‌డు. రాష్ట్రాన్ని సాధిస్తాడ‌నే న‌మ్మ‌కంతో ఒక సైనికుడిలాగా 24 ఏండ్ల కింద‌ట కేసీఆర్‌తో క‌లిసి న‌డిచారన్నారు. సూర్యాపేట‌లో డిపాజిట్ రాద‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అంటున్నారు. ద‌మ్ముంటే రా తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు.

Also Read:‘మంత్ ఆఫ్ మధు’.. ఫీల్ గుడ్ మూవీ

- Advertisement -