KTR:దేశంలో అట్టర్‌ఫ్లాప్ మంత్రి కిషన్‌ రెడ్డే

19
- Advertisement -

భారతదేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డినే అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…..కిషన్ రెడ్డికి మరోసారి ఒటు అడిగే హక్కు లేదు అన్నారు. అంబర్‌పేటలో ఓడిపోయిన సానుభూతితో గత పార్లమెంట ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచాడన్నారు.

ఐదు సంవత్సరాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటో ప్రజలకు వివరించి ఈసారి ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం మంత్రిగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏదైనా ఒక్కటి తెలంగాణకు ఇచ్చిండా ఆలోచింఆలన్నారు. హైదరాబాదులో అతిపెద్ద గుడి కట్టింది పీజేఆర్ కుటుంబం… ఆయన కుమారుడు మన పార్టీలో ఉన్న ఏ రోజు దాని వాడుకోలేదు అన్నారు.

రామ మందిరం కట్టడం మంచిదే కానీ రాజకీయంగా పరిపాలన పరంగా బిజెపి ఏం చేసిందో చెప్పాలన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. మోడీ ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అని…పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాదులో మల్ల ఎగిరేది గులాబీ జెండానే అన్నారు.

Also Read:KTR:కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం

- Advertisement -