KTR:రుణమాఫీపై కేటీఆర్ సవాల్, నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

5
- Advertisement -

వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రుణమాఫీపై మీరు చెప్పిన మాటల్లో నిజం ఒక్క శాతం నిజం ఉన్నా సరే.. సెక్యూరిటీ లేకుండా నీ కొడంగల్ నియోజకవర్గానికి రావాలని సవాలు విసిరారు.

కొడంగల్‌ లోని ఏ గ్రామంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీపై రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఊరూరు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి తన సవాలును స్వీకరించాలని అన్నారు.

రెండు లక్షల రుణమాఫీ కోసం 40వేల కోట్లు అవుతుందని రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఒక సంవత్సరం నేను కడుపుగట్టుకుంటే ఈ డబ్బును అనాయసంగా కట్టేయొచ్చని రేవంత్‌ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఎన్నికల ముందు చెప్పారని.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి.. కేవలం 40 శాతం మందికి చేసి.. 100 శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని మండిపడ్డారు.

Also Read:Nara Lokesh: రెడ్ బుక్‌లో ఉన్న ఏ ఒక్కరిని వదలను

- Advertisement -