రైతుల సమస్యలపై ప్రజా చర్చకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రైతుల కోసం ఎవరు ఏం చేశారు అని చర్చిద్దాం..ఇందుకోసం రేవంత్ రెడ్డికి 72 గంటలు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. చింతమడక, కొండారెడ్డి పల్లె, లేదా రేవంత్ ఎక్కడ ప్లేస్ చెప్పిన సరే చర్చకు సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను ఇప్పటికి మోసం చేస్తున్నారని.. రైతు బంధు పథకాన్ని రద్దు చేయనుంది అని ఆరోపించారు. రైతులను అవమానిస్తూ ఇన్‌పుట్ సబ్సిడీలను తీసేసి వ్యవసాయాన్ని భారంగా మార్చారు అన్నారు. రేవంత్ రెడ్డి “పే సీఎం” (Paytm లాగా) అనే పేరు సంపాదించారని ఎద్దేవా చేశారు.
ప్రజా పాలన కాదు, చంద్రబాబు దోపిడి పాలనను ప్రతిబింబిస్తున్నాడని చెప్పారు. తెలంగాణలో ప్రజల పాలన లేదు, కానీ చంద్రబాబుల కోవర్ట్ పాలన ఉంది, ఇది రేవంత్ రెడ్డి ద్వారా జరుగుతోంది అన్నారు. ఉద్యోగాలపై రేవంత్ చేసిన కామెంట్స్ తప్పు అని..గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తాము ఇచ్చినట్లుగా రేవంత్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నిరుద్యోగ యువత మధ్య ఆషోక్ నగర్‌లో చర్చకు రావాలి సవాల్ విసిరారు.
రేవంత్ చేసే మోసాలు 100 సీట్లు గెలిపిస్తాయా? 100 గెలవడానికి ప్రజలు ముందుగా ఓటు వేయాలి కదా అన్నారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో జెడ్‌పిటిసి కూడా గెలవలేకపోయాడు అన్నారు.KTR, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రైతుల సమస్యలపై నిజాన్ని చెప్పినందుకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగలా మారిందని..కఠిన పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకున్నామన్నారు.
Also Read:వివాదంలో రణబీర్!
BC రిజర్వేషన్ల, రైతుల హక్కులు, మరియు ప్రజా సంక్షేమం కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తప్పుడు వాగ్ధానాలు మరియు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్నట్లు హెచ్చరించారు.

