సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కొడంగల్ లో ఉప ఎన్నిక జరిగితే.. 50వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కొస్గి రైతు ధర్నాలో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా అన్నారు.
కులగణన చేశా, బీసీలందరూ సంతోషంగా ఉన్నారు, రైతు బంధు వేశా రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతు కూలీలకు పైసలు వేశా వాళ్లు సంతోషంగా ఉన్నారు, ఇళ్ల కాగితాలు ఇచ్చా పేదలంతా సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రండి. ఎవరు గెలుస్తారో చూద్దాం…గెలవడమే కాదు 50వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
ప్రచారానికి మేము ఇంతమంది రాము. మీరు భయపడొద్దు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లోనే కూర్చుంటాడు. బయటకు కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం అని చెప్పారు. 420 హామీలు ఇచ్చి మళ్లీ మోసం చేస్తానంటే కుదరదు అని సవాల్ విసిరారు కేటీఆర్.
Also Read:కేసీఆర్ ఐఫోన్.. రేవంత్ రెడ్డి చైనా ఫోన్!

