ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి కానీ రేవంత్ రెడ్డి మాత్రం దివ్యంగా ఉన్న తెలంగాణ దివాలా తీసిందని ఆరోపణలు చేస్తున్నాడు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులకు,ప్రతీ రోజు కాంగ్రెస్ తో తలపడుతున్న కార్యకర్తలకు,కేసులకు వెరవకుండా సింహాల్లాగా పోరాడుతున్న నాయకులకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.
కేసీఆర్ సూచన మేరకు ఈ పోరాటాన్ని మరో నాలుగేండ్లు ఇంకా ఉదృతంగా తీసుకుపోదాం అన్నారు. మేము కోకా కోలా కంపెనీ తెస్తే రేవంత్ రెడ్డి పోయి ఫోజులు కొడుతున్నాడు..నువ్వు పీకింది ఏముంది అక్కడ.. మేము కాళేశ్వరం నీళ్లు తేచాము, కోకా కోలా కంపెనీ తేచాము.. నువ్వు రిబ్బన్ కట్టింగ్లకు మాత్రమే పనికి వచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రి – కేటీఆర్ ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఇప్పుడు ఆ 20 చోట్ల భూసేకరణ విరమించుకుంటున్నారా? చెప్పాలన్నారు.
ఎక్కడైనా భూసేకరణ చేయాలి అంటే అక్కడ రెండు పంటలు పండే భూమి ఉన్నా, 80 శాతం రైతుల సమ్మతం లేకపోయినా, డీపీఆర్ లేకపోయినా ఎట్టి పరిస్థితిలో భూమి తీసుకోవద్దని రేవంత్ రెడ్డినే చెప్పాడు.. ఈ మూడిటిలో లగచర్లలో ఒక్కటైనా ఉందా? చెప్పాలన్నారు. అన్ని పార్టీలను, ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని లగచర్లకు పంపు అన్ని ఉన్నాయో లేదో చూద్దాం..రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 12 వేల ఉద్యోగాలు ఇచ్చాడు అన్నారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఈయన ఇచ్చినట్టు ఖాతాలో వేసుకున్నాడు అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి గురించి మొత్తం రాహుల్ గాంధీకి తెలుసు. అందుకే దూరం పెడుతున్నాడు.. కానీ బయటకి తెలియకుండా స్వాతిముత్యంలా యాక్టింగ్ చేస్తున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థ అంతా నీ దగ్గరే ఉంది కదా కేసీఆర్‌కు 1000 ఎకరాలు ఫాం హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసి ఇస్తాం అన్నారు.
Also Read:మధ్యాహ్నామే తాగే వెంకట్‌రెడ్డికి మంత్రి పదవా?