సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

35
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ కు ప్రతిసవాల్ విసిరిన కెటిఅర్.. గెలిచిన ప్రతిసారి మగవాడిని …. ఒడితే కాదు అంటావా…కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగడివికాదా అని ఎద్దేవా చేశారు. మగాడివి అయితే…రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయి…ఆడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయ్యి….అడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా అని ప్రశ్నించారు.

రేవంత్ కు ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉంది…కొండగల్, జీహెచ్‌ఎంసీ సమయంలో పోటీ చేసి… సవాల్ విసరి పారిపోయిండు అన్నారు. అయన మాటకు విలువ ఏం ఉంది..రేవంత్ గా కు దమ్ముంటే సిఏం కు రాజీనామా చేయండి… మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం అన్నారు.అదే అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలి…నేను సిరిసిల్లాలో ఎమ్మెల్యే పదవికి రాజఈనామా చేస్తే…దమ్ముంటే రేవంత్ సిఏం పదవికి రాజీనామా పోటీకి రావాలన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఒటములు సహాజం…మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా…రేవంత్ ది పేమేంట్ కోటా… మాణికం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా అని ఆరోపించారు. పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… డీల్లీకి పేమేంట్ చేయాలి…బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి…అందుకే భవన నిర్మాణ అనుమతులు అపినారు… ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలన్నారు.

త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు…అయన నేనే సిఏం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు… అయనకు అయననే సిఏం అన్న నమ్మకం లేదా అన్నారు.

Also Read:ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటున్నారా..!

- Advertisement -