KTR:ఓటు వేయకుండా నిందిస్తే లాభం లేదు

20
- Advertisement -

ఓటు వేయకుండా ప్రభుత్వాలను నిందిస్తే లాభం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని తెలిపారు. బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో కుమారుడు హిమాన్షు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్‌ ఓటువేశారు కేటీఆర్.

మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటెయ్యాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్‌లో కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని ప్రభుత్వం కష్టపడుతున్నదని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి కేసీఆర్‌ నాయకుడని, తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఓటేశానని చెప్పారు.

Also Read:ఓటేసిన సినీ,రాజకీయ ప్రముఖులు

- Advertisement -