మోడీ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసన..

45
ktr
- Advertisement -

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. మోడీ వ్యాఖ్యలపై ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మల దహనం చేయడంతో పాటు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు.

పార్లమెంట్‌ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపిన కేటీఆర్…. దశాబ్దాల పోరాటం, ప్రాణ త్యాగాలను మోదీ కించపరిచారన్నారు. వెంటనే ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -