ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టడం కాదు.. మీ కాంగ్రెస్ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూత్ డిక్లరేషన్లో 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు…100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.. 1000 రోజులు అయింది,బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదు అన్నారు. మళ్లీ కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నారు…తెలంగాణ కేసీఆర్ రాజీనామా చేయాలా..? లేదా రేవంత్ రెడ్డి అనే బట్టెబాస్ గాడు చేయాలా చెప్పాలన్నారు.
అతడు సినిమాలో బ్రహ్మానందం నాలుగు రోజులు ఎక్సర్‌సైజ్ చేసి నాకు బాగా బలం వచ్చిందని చెప్పి మహేష్ బాబుని హిట్ మీ యార్, హిట్ మీ అని అంటాడు..మహేష్ బాబు గట్టిగా గుద్దితే బ్రహ్మానందం కిందికెళ్ళి పేస్ట్ కారుతుంది..కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గతి కూడా అదే అవుతుంది అన్నారు.
మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్…1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ఈ ముసలి నక్కే…1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్…1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్‌లో కలుపుకుంది ఈ ముసలి నక్కే…2004లో సోనియా గాంధీ మాటిచ్చి ఆ తర్వాత పదేళ్లు తెలంగాణ ఇవ్వకుండా సతాయించింది…శ్రీకాంతాచారి లాంటి తమ్ముళ్లు వందల మంది ప్రాణాలు కోల్పోయాక, కేసీఆర్ నిరాహార దీక్ష చేశాక ఈ ముసలి నక్క తెలంగాణ ఇచ్చింది అన్నారు.
Also Read:హైదరాబాద్‌లో ‘కాకా’!

