ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరిని తప్పుబట్టారు మంత్రి కేటీఆర్. ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని… ఇలాంటి అంశాలను రాజకీయం చేసి అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేటీఆర్ సూచించారు.
For your information @UttamTPCC Garu @TelanganaPolice headed by @TelanganaDGP Mahendar Reddy Garu has been consistently rated as the best & a role model to the country in maintaining law & order
Let’s not unnecessarily politicise & demoralise hardworking Telangana officers 🙏
— KTR (@KTRTRS) October 25, 2018
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు 3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని.. ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విటర్ వేదికగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన కేటీఆర్…ఆయనకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Stop being downright crass & cheap @UttamTPCC
Are you insinuating that everyone who belong to a community is related & biased?
I understand your anxiety about cars being searched (as in 2014 when you were caught with 3Cr cash stash), atleast uphold dignity of the post you hold https://t.co/XEPo4I8C9K
— KTR (@KTRTRS) October 25, 2018